- భారీ ఆస్తి నష్టం, నందిపల్లి గ్రామంలో ఘటన
- ఘటనపై స్పందించిన మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నందిపల్లి గ్రామ శివారులో ఘటన శుభకార్యాలలో డెకరేషన్ చేసే సామాగ్రి గోదాంలో అగ్ని ప్రమాదం భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీయడం జరిగింది ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బంది. సిఐ వెంకటేశ్వర్లు. మరియు మాజీ సర్పంచ్ కావలి.దశరథ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కావలి దశరథ మాట్లాడుతూ… రాత్రి వేళల్లోనే సెక్యూరిటీని పెట్టడం కాదు ఉదయం కూడా సెక్యూరిటీని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. మై హోమ్ సంబంధించిన స్థలంలో అద్దెకు తీసుకొని శుభకార్యాలలో డెకరేషన్ చేసే సామాగ్రిని అక్కడ ఉంచడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సామాగ్రికి యజమాని అయినటువంటి ఆనంద్ సాయి అందుబాటులో లేకపోవడంతో జూబ్లీహిల్స్ లో ఉండే ఆఫీస్ నుండి సూపర్వైజర్ శీను ఇచ్చిన సమాచారం మేరకు చాలా ఆస్తి నష్టం జరిగినట్లు తెలియపరిచారు.. గోదాం కి పూర్తిగా ఫ్రీ కాస్ట్ వేయించడంతో అక్కడ సామాగ్రి ఉన్నట్లుగా ఎవరికి సమాచారం లేదు ఈ ఘటనకు ఇది కూడా కారణం ముఖ్యంగా రాత్రి వేళలో మాత్రమే సెక్యూరిటీని పెట్టడం జరిగింది. ఉదయం సెక్యూరిటీ ఎవరు లేకపోవడంతో… యొక్క అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు దీనిపై విచారణ చేపట్టారు.





