- పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోండి
- సీడీఎం గౌతమ్‌కు నగర కార్పొరేటర్ల వినతి
కరీంనగర్, సెప్టెంబర్16: కరీంనగర్స్మార్ట్సిటీ అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా చూడాలని మున్సిపల్అడ్మినేస్ట్రేషన్డైరెక్టర్గౌతమ్ను స్థానిక ఎంఐఎం కార్పొరేటర్లు విన్నవించారు. ఏఐఎంఐంఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు బుధవారం సీడీఎంఏను కరీంనగర్నగర పాలక సంస్థ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ డివిజన్లలో నెలకొన్న సమస్యలను వివరించారు. స్మార్ట్‌సిటీలో భాగంగా 5వ, 27వ డివిజన్లకు దాదాపు రూ.9 కోట్ల రూపాయల వ్యయంతో రెండు డ్రైన్లకు టెండర్లు పూర్తయినా, పనులు ప్రారంభించలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీఎం సహాయక నిధుల పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయని వివరించారు. దీనిపై సీడీఎంఏ సానుకూలంగా స్పందించాలని కార్పొరేటర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ అబ్బాస్సమీ, ఫ్లోర్‌లీడర్ అఖిల్ఫేరోజ్, శర్ఫొద్దీన్, బర్కత్‌అలీ, అజహర్దబీర్, అలీబా, ఆతీన తదితరులు పాల్గొన్నారు.