Saturday, March 21, 2026

ఈ నెల 22 నుంచి కందుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి..!

  • కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
  • తేమ 12 శాతం లోపు ఉన్న కందులకు 7550/- మద్దతు ధర

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల( కోక్కుల వంశీ ) : శనివారం నుంచి జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో కందుల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ… సిరిసిల్ల జిల్లాలో మొత్తం 1129 ఎకరాలలో కందుల సాగు జరిగిందని, మొత్తం 6 వేల 211 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అన్నారు.ఐకెపి కేంద్రాల ద్వారా గంభీర్ రావు పేట్, ఇల్లంతకుంట, ముస్తాబాద్, తంగళ్ళపల్లి, ఎల్లారెడ్డిపేట, చందుర్తి మండలాల్లో ఐకెపి కేంద్రాల మిగిలిన చోట్ల పి.ఏ.సి.ఎస్. కేంద్రాల ద్వారా కందుల కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి మండలంలో కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో అధికారులు నిర్ణయించి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్ యార్డులలో, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కందుల కొనుగోలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాల నుంచి సమీప గోడౌన్లకు కందుల తరలింపు కోసం రవాణా కొరకు టెండర్ ల ద్వారా అవసరమైన వాహనాలు అందుబాటులోకి పెట్టాలని, కందుల కొనుగోలుకు అవసరమైన గన్నీ బ్యాగులు, వెయింగ్ యంత్రాలు తేమ యంత్రాలు, టార్ఫాలిన్ లు, ఇతర సౌకర్యాలు ఉండేలా చర్యలో చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కందులు కొనుగోలుకు సంబంధించి కనీసం మద్దతు ధర, పంట నాణ్యత పరిశీలన,12 తేమ శాతం , ఇతర నాణ్యత ప్రమాణాలపై అధికారులకు అవసరమైన శిక్షణ కార్యక్రమం రేపటి నుంచి అందించాలని, ఫిబ్రవరి 22 శనివారం నుంచి జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతుల నుంచి కొనుగోలు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు.

తేమ 12 శాతం లోపు ఉన్న కందులకు రూ 7550/- మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని, కందుల పంట సంబంధించి అవసరమైన నాణ్యత ప్రమాణాలను రైతులకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన హమాలీలు అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా మార్కెఫెడ్ అధికారి హాబీబ్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాష్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జలిబేగం, డి ఆర్ డి ఓ శేషాద్రి, డి సి ఓ రామకృష్ణ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News