నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- సీపతి సుమతి- మల్లేష్ సేవలు మరువలేనివని నస్పూర్ వార్డు కార్యాలయ శానిటేషన్ సిబ్బంది అన్నారు. జిల్లాలోని నస్పూర్ మున్సిపాలిటీలోని పదవ వార్డు కౌన్సిలర్ గా శ్రీపతి సుమతి – మల్లేష్ ఐదు సంవత్సరాలుగా తమ సేవలను అందించి, పదవీకాలం పూర్తి అయిన సందర్భంగా నస్పూర్ వార్డు కార్యాలయం శానిటేషన్ సిబ్బంది సోమవారం ఘనంగా సన్మానించారు. అనంతరం వారు వార్డుకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇరికిల రాజేష్, మల్లయ్య, ఆవుల శ్రీలత, మాధవి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.





