నేటి సాక్షి, మంథని (పెయ్యల రమేష్) : ఆదివారం రోజున మంథని ఫ్రెండ్స్ క్లబ్ లో శిక్షకులు కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో శిఖోకాయి షిటోరియు కరాటే బెల్టు పోటీ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీ పరీక్షల్లో కథ, కుమితి బ్లాక్స్, కిక్స్ టెక్నిక్స్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ బెల్ట్ పోటీల్లో విద్యార్థిని విద్యార్థులు పలురాకాల బెల్ట్ లకు అర్హత సాధించారు.ఎల్లో బెల్స్ 15 మంది, ఆరెంజ్ బెల్స్ 15 మంది, గ్రీన్ బెల్స్ పదిమంది, బ్లూ బెల్స్ ఐదుగురు అర్హత సాధించారు. ఈ పోటీ పరీక్షలకు చీఫ్ ఎగ్జామినేర్గా పాలకుర్తి పాపయ్య,మాట సంపత్ వ్యవహరించారు. ఈ పోటీ పరీక్షలకు ముఖ్యఅతిథిగా మంథని మున్సిపల్ చైర్మన్ పెండురమ సురేష్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య, కౌన్సిలర్స్ వీకే రవి మాజీ సర్పంచ్ వడ్నాల శ్రీనివాస్, మాజీ మార్కెట్ చైర్మన్ అజీమ్ ఖాన్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోటికారి కిషన జి, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, సందీప్, జపాన్ సిటోరియు కరాటే అకాడమీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటుపల్లి సమ్మయ్య పలురాకాల బెల్టులు అర్హత సాధించిన విద్యార్థులకు బెల్టులు మరియు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్స్ట్రక్చర్స్ నాగలి రాకేష్, కావటి శివ గణేష్ జడగల శివాని, మెట్టు హాసిని, ఎండి తైబా, కే. శ్వేత నందన తదితరులు పాల్గొన్నారు.





