Tuesday, March 10, 2026

జాతీయ స్థాయి సీనియర్ బీచ్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక

నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో : హ్యాండ్బాల్ అసోసియేషన్ తెలంగాణ ( హెచ్.ఏ.టీ ) ఆధ్వర్యంలో జరిగిన సెలెక్షన్ ట్రయాల్స్ లో సీనియర్ పురుషుల, మహిళ విభాగంలో ప్రతిభ కనబరిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఇద్దరు ఎంపికయ్యారు. వీరు జైనపురం సాయికుమార్,వనం గాయత్రి గుల్లకోట ,లు జాతీయ స్థాయి బీచ్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక అయినట్లు హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వడ్లూరి రాజేందర్, జిట్టబోయిన శ్రీను, తెలిపారు.వీరు ఈ నెల 10 నుండీ 14 వ తేదీ వరకు అస్సాం రాష్ట్రం లో జరిగే 53 వ జాతీయస్థాయి సినియర్ పురుషుల మరియు మహిళల బీచ్ హ్యాండ్ బాల్ పోటీలలో పాల్గొంటరు. అని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ చైర్మన్ జగన్మోహన్ రావు, హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష కార్యదర్శులు రంజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ లు తెలిపారు. వీరి ఎంపిక పట్ల మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాస రావు,ఏఎంసీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి ముదిరాజ్, ట్రెజరర్ కలిగేటి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జెట్టిపల్లి అశోక్,ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, జనార్దన్ రెడ్డి, పెటా టీఎస్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ యూనిస్ పాషా, డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, సీనియర్ పిడి లు సంపత్ రావు, కొమురొజు కృష్ణ, బాబు శ్రీనివాస్, అనూప్ రెడ్డి, ఇతరవేని శ్రీనివాస్ , భాస్కర్ ,రాజకుమార్, మహేష్, లింగా రావు,హ్యాండ్ బాల్ క్రీడాకారులు అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News