- ప్రజాపాలన ప్రత్యేక గ్రామ సభలో
- మండల ప్రత్యేక అదికారి రఘవరన్

నేటీ సాక్షి,ఇబ్రహింపట్నం :
గ్రామసభ ఆమోదం ద్వారానే లబ్ధిదారులను జరుగుతుందని జగిత్యాల ఇబ్రహీంపట్నం మండల ప్రత్యేక అధికారి రఘువరన్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని బర్తిపూర్, ఫకిర్ కొండాపూర్, ఎర్రపూర్, కోజన్ కొత్తూరు గ్రామాలలో మంగళవారం ప్రజా పాలన ప్రత్యేక గ్రామ సభను నిర్వహించారు. ఈ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఆరు గ్యారెంటీలో భాగమైనటువంటి ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, కొత్తఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకములకు అర్హులైన లబ్ధిదారుల యొక్క వివరాలను గ్రామ సభలో గ్రామస్తుల సమక్షంలో ప్రత్యేక అధికారి చదివి వినిపించారు. జాబితాలో పేరు లేని వారి నుండి కొత్తగా దరఖాస్తులు తీసుకోవడం జరిగింది.వీరి పైన ఏమైనా అభ్యంతరములు ఉన్నట్లయితే తెలియజేయవచ్చునని అదికారులు పేర్కొన్నారు. గ్రామాలలో లబ్ధిదారులు ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే సంబంధిత కార్యాలయాల్లో నిరంతరం వారికి కావలసిన ఆర్గారంటీల కోసం తాహసిల్, ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని మండల ప్రత్యేక అధికారి రఘువరన్ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో సాంబరి చంద్రశేఖర్, అఖిల్, అరుణ,మల్లేష్, శైలజ, పంచాయతీ కార్యదర్శులు రాకేష్, రాజ శేఖర్, మహేంధర్, దివకర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




