- విద్యార్థులు ఉపాధ్యాయులు అయిన వేల

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : వనపర్తి మండలంలో శ్రీనివాసపురం లో ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు అయిన వేల పాఠశాల ప్రాంతమంతా కొత్త వన్నెలు సంతరించుకొని పాఠశాల ప్రాంగణమంతా కళకళలాడింది. నిత్యం విద్యాబోధనతో ఉపాధ్యాయులు పుస్తకాలతో కుస్తీపట్టే విద్యార్థులు నేడు విద్యార్థులు తోటి విద్యార్థులకు విద్యను బోధించడంతో ఆనందించారు. పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో సంబంధిత అంశాలపై విద్యా బోధన తోటి విద్యార్థులకు బోధిస్తూ సంతోషించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంఈఓ కె. భవ్య శ్రీ, ప్రధానోపాధ్యాయురాలు కె. సాయిలీల, ఉపాధ్యాయురాలు గుజ్జుల హరిణి మాట్లాడుతూ ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి మా ప్రధానోపాధ్యాయురాలికి ఉపాధ్యాయులందరికీ శిరసు వంచి పాదాభివందనాలు చేస్తున్నామన్నారు. 18 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థుల బోధనను చూసి సంతోషపడ్డారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన కౌన్సిలర్ విభూది నారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మల్ల రాములు మాట్లాడుతూ విద్య అనేది ప్రతి మనిషికి ఒక గొప్ప ఆయుధం దాన్ని మనం ఎలా మలుచుకుంటే అలా మనల్ని మన జీవితాన్ని తయారు చేస్తోందన్నారు. విద్య యొక్క గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. ప్రతి విద్యార్థి దేశానికి రాష్ట్రానికి పుట్టి పెరిగిన ప్రాంతానికి మంచి పేరు తేవాలన్నారు, చదులో రాణించాలంటే కృషితో పట్టుదలగా చదవాలన్నారు, విద్యార్థిని విద్యార్థులు నిత్యం వారి మెదడుకు పదును పెడుతూ కదులుతున్న విజ్ఞాన భాండాగారాలుగా తయారు కావాలన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఈ. షాంబావి మాట్లాడుతూ విద్య గొప్పతనం గురించి చెబుతూ ఈరోజు పిల్లలు ఉపాధ్యాయులు అయినటువంటి వేల చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని నానుడి నిజం ఇదే పిల్లలు రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా కలెక్టర్లుగా తయారు చేసి నవ సమాజ నిర్మాణానికి వారిని పంపే గురుతర బాధ్యత ఒక ఉపాధ్యాయుని పైనే ఉంటుంది అన్నారు. అలాంటి వృత్తిలో ఉన్నందుకు గర్వపడుతున్నామన్నారు. ప్రపంచంలో చూసి నట్లయితే నిత్యం ఎక్కడో ఒక కాడ మోసం జరుగుతూనే ఉంటుంది, మోసం చేయనిది ఒక విద్య మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం.రాజేశ్వరి,డి.శ్వేతా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




