Monday, March 30, 2026

ఎంపీపిఎస్ ఇర్కిచేడు పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవ వేడుక

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : కేటి దొడ్డి మండలంలోని ఇర్కిచేడు ఎంపీపిఎస్ పాఠశాలలో శుక్రవారం ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి పలువురిని ఆకట్టుకున్నారు అదే విదంగా విద్యార్థులు టీచర్లుగా కలెక్టర్ గా ఎంఈఓ గా పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ : ఈ స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు ఇన్ని రోజులు ఉపాధ్యాయులు పాఠాలు బోధించేటప్పుడు కూర్చొని విన్నాము కానీ ఈరోజు మేమే ఉపాధ్యాయులుగా పాత్రలు వేసి నాతోటి విద్యార్థులకు పాఠాలు బోధించే సమయంలో చాలా అనుభూతి చెందామని కొనియాడారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బృందం మాట్లాడుతూ.. మా కళ్ళ ఎదుట ఉపాధ్యాయులుగా ఎంఈఓ గా కలెక్టర్ గా పాత్రలు పోషించడం పిల్లలకు పాఠాలు బోధించడం చాలా ఆనందమని విద్యార్థులను ఉపాధ్యాయులు అభిమానించారు ఇవి పాత్రలకే కాకుండా నిజజీవితంలో మీరు ఏ పాత్ర అయితే పోషించారో ఆ పాత్రలో మీరు కూడా నిజ జీవితంలో ఉండాలని విద్యార్థులకు ఉపాధ్యాయుల బృందం సూచన చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయుల బృందం కలిసిమెలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News