Tuesday, March 31, 2026

ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వయం పాలన దినోత్సవం

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో మంగళవారం ఘనంగా స్వయం పాలన దినోత్సవం వేడుకలు జరిగాయి. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి అభ్యసన సామర్ధ్యాలకు అనుగుణంగా బోధించడం ఎంతగానో ఆకట్టుకున్నవి. ఈ కార్యక్రమంలో డి ఇ ఓ గా సాత్విక ఎం ఈ ఓ హరినాథ్ హెచ్ ఎం గా జస్వంత్ మరియు ఉపాధ్యాయులుగా ధనుష్, సాత్విక్, మనోజ్ఞ, మీనాక్షి, హన్విత, సిరి చందన, రిత్విక్, వ్యవహరించారు. ఈ కార్యక్రమం లో కన పరచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన విద్యార్థిని, విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. కొమురయ్య ఉపాధ్యాయులు గుండ ప్రభాకర్, ఆర్. సురేఖ లు అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News