Monday, March 30, 2026

లిఫ్ట్ ప్రమాదంలో పోలీస్ ఉన్నతాధికారి మృతి

  • లిఫ్ట్ వచ్చిందనుకుని అడుగుపెట్టిన పోలీస్ అధికారి
  • దుర్మరణం పాలైన టీజీఎస్పీ 17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల ( కోక్కుల వంశీ ) : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ పోలీసు ఉన్నతాధికారి లిఫ్ట్ ప్రమాదంలో మరణించారు. సిరిసిల్లలోని ఓ బిల్డింగ్ లో లిఫ్ట్ వచ్చిందనుకుని అడుగుపెట్టడంతో ఒక్కసారిగా కిందికి పడిపోయారు. కింద ఉన్న లిఫ్ట్ పై పడి ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో పోలీస్ అధికారి గంగారామ్ (55) దుర్మరణం పాలయ్యారు. గంగారామ్ తెలంగాణ స్పెషల్ పోలీస్ 17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన తెలంగాణ సచివాలయానికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News