చెరువులో ఎస్.ఐ., మహిళా కానిస్టేబుల్ ల మృతదేహాలు లభ్యం



నేటిసాక్షి, కామారెడ్డి :
కామారెడ్డి జిల్లాలోని బిక్కనూర్ పోలీస్ స్టేషన్ ఏస్.ఐ సాయికుమార్, బీబీపేట్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ శృతి, వీరితో పాటుగా బిబీపేట్ సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ లు కామారెడ్డి జిల్లాలోని అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో దూకి సామూహిక ఆత్మహత్య లు చేసుకున్నారు. గత రెండురోజులుగా, ఎస్.ఐ సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి సెల్ ఫోన్లు రెండురోజులుగా స్విచ్చాఫ్ రావటంతో, అప్రమత్తమైన పోలీసు అధికారులు ఇరువురి సెల్ఫోన్ లను ట్రెసింగ్ చేశారు. దీంతో కామారెడ్డి జిల్లాలోని సదాశివ నగర్ మండలం అడ్లుర్ఎల్లారెడ్డి చెరువు వద్ద లోకేషన్ ట్రేస్ అయినట్లు తెలిసింది. బుధవారం సాయంత్రం పోలీసు అధికారులు, సిబ్బంది హుటాహుటిన చెరువు వద్దకు చేరుకుని పరిశీలించగా, ఎస్.ఐ సాయికుమార్ కారు, చెప్పులు మహిళా కానిస్టేబుల్ శృతి సెల్ ఫోన్ లభ్యమయ్యాయి. కాగా వీరితో పాటుగా బీబీపేట సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ సైతం ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. పోలీసు వృత్తిలో భాగంగా ఎన్నోరకాల సమస్యలతో వచ్చే ప్రజలకు, బాధితులకు కౌన్సెలింగ్ నిర్వహించి, పరిష్కార మార్గాలను, చూపే నిబద్ధత కలిగిన పోలీసు శాఖ ఎస్.ఐ మహిళా కానిస్టేబుల్ వారితో పాటుగా ఒక ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్యలకు పాల్పడటం జిల్లాలో సంచలనం కలిగించింది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సిందుషర్మ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు, పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు. సదాశివనగర్, భిక్కనూర్, కామారెడ్డి సి.ఐ లు ఎస్.ఐ లు పోలీసు సిబ్బందితో పాటు రెస్క్యూ టిం, గజ ఈతగాళ్లతో బోటు సహాయంతో, గాలింపు చర్యలు చేపట్టారు. చెరువు విస్తీర్ణం పెద్దదిగా, లోతుగా ఉండటంతో, దీనికి తోడు బుధవారం చీకటి పడటం వలన గాలింపు చర్యలలో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎస్.ఐ సాయికుమార్ తో పాటు ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్ శృతి గత పదేళ్లుగా పోలీసు శాఖలో విధులు నిర్వహించిందని, ఆమె స్వగ్రామం కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రం అని కుటుంబీకులు తెలిపారు. శృతికి పెళ్లైనప్పటికి వ్యక్తిగత కారణాల వలన ఐదేళ్ల క్రితం తన భర్తకు విడాకులు ఇచ్చినట్లు సమాచారం.
బిక్కనూర్ పోలీస్ స్టేషన్ ఏస్.ఐ సాయికుమార్ కు, బిబీపేట పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ గ పనిచేసిన శృతి కి అధికారి సిబ్బంది కి సంభందించిన శాఖ పరమైన సంభదమా? లేక వారి మధ్య వ్యక్తిగత సంభదం ఏర్పడింద అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఈ కేసులో లక్షభిలియన్ డాలర్ల ప్రశ్న ఒక్కటే అదే ఎస్.ఐ మహిళా కానిస్టేబుల్ సహా ఒక ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన, ఆత్మహత్య చేసుకున్న ముగ్గురి శవపంచనామ, పోస్టుమార్టం రిపోర్టు మరియు మృతుల కుటుంబా సభ్యుల వాంగ్మూలం, వారి స్నేహితులు, సన్నిహితుల వాంగ్మూలం నమోదయ్యాకే కేసు చిక్కుముడి విడి పూర్తి సమాచారం తెలుస్తుందని అధికారులు తెలిపారు. ఇట్టి గాలింపు చర్యలు బుదవారం రాత్రి నుండీ గురువారం తెల్లారుజామున 3:00 ల వరకు కొనసాగాయి. మృతులు శృతి మరియు నిఖిల్ మృతదేహాలు లభ్యం అయ్యాయి. కానీ ఎస్.ఐ సాయికుమార్ మృతదేహం లభ్యం కాలేదు. పోలీసు అధికారులు చెరువు దగ్గర ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి శ్రమించి రెండు మృతదేహాలను, చెరువులోనుండీ బయటకు తీశారు.
పోలీసుల రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ గురువారం ఉదయం 8:30 గం. లకు ఎస్.ఐ సాయికుమార్ మృతదేహాన్ని చెరువులొంచి బయటకు తీశారు.

