- విద్యార్థులను మోసం చేసిన రాష్ట్ర సర్కారు ను నిలదీయండి.
- P D S U ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణా ప్రతాప్
నేటి సాక్షి, కరీంనగర్ :
రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి స్వల్ప నిధుల కేటాయింపును ను నిరసిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ లో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా PDSU కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణా ప్రతాప్ మాట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యారంగానికి స్వల్పనిధులు కేటాయించడం బాధ్యతరాహిత్యానికి నిదర్శనం అన్నారు. 3,04965 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో కేవలం విద్యారంగానికి 23 వేల 108 కోట్లు కేటాయించిందన్నారు. ఇవి ఉద్యోగుల జీతభత్యాలకు కూడా సరిపోవు అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని నేడు కేవలం 7.7% నిధులు మాత్రమే కేటాయించిందని అన్నారు. ఇది విద్యార్థులను మోసం చేయడమే అని పేర్కొన్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రభుత్వ విద్యాసంస్థలు తీవ్రమైన సమస్యలతోని సతమతమవుతున్నాయని, వాటికి ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8వేల కోట్ల రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయని వాటి విడుదలకు నిధులు కేటాయించకపోగా కనీసం ఎప్పుడు ఇస్తారో కూడా ప్రకటించకపోవడం తీవ్రమైన నిర్లక్ష్య ధోరణిని నిదర్శనం అన్నారు. కోటి ఉమెన్స్ యూనివర్సిటీకి 560 కోట్లు కేటాయించి మిగతా ఏ యూనివర్సిటీలకు ప్రత్యేకమైన నిధులు కేటాయించకపోవడం ఉన్నత విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తుస్తుందని అన్నారు. వెంటనే బడ్జెట్ ని సవరించి విద్యారంగానికి 20 శాతం నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు కాంసారపు రవితేజ, నాయకులు కొయ్యడ బాబు, ఎండీ అస్లాం, రమేష్, అజయ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.





