Wednesday, March 11, 2026

పసుపు బోర్డు ఏర్పాటు చేయడం శుభపరిణామం

పసుపు బోర్డు ఏర్పాటు అంశం వెనుకాల మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత కృషి ఎంతో ఉంది
హైకోర్టు అడ్వకేట్, బి ఆర్ ఎస్ నాయకులు జె.డి‌ సుమన్

నేటి సాక్షి, హైదరాబాద్ :
పసుపు బోర్డు ఏర్పాటు అంశం పై గత 10 ఏండ్లలో నిజామాబాద్ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృషి ఎంతో ఉందని హైకోర్టు అడ్వకేట్, బి ఆర్ ఎస్ నాయకులు జె.డి సుమన్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. నిజామాబాద్ పసుపు బోర్డు ఏర్పాటు కై కవిత ఎంతగానో కృషి చేశారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేల బృందాన్ని తీసుకెళ్లడం, పసుపు పండించే రాష్ట్రాల సిఎంలతో లెటర్ లు ఇప్పించడం, ప్రధాని ని కలవడం, పార్లమెంట్ లో పలుమార్లు ప్రస్తావించడం, పసుపు బోర్డు ఏర్పాటు అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లడం మరియు మద్దతు ధర కోసం హైదరాబాద్ లో పార్క్ హయత్ లో రైతులను తీసుకెళ్లి కేంద్రం నుండి వచ్చిన బృందానికి వినిపించడంలో ఆమె కృషి ఎంతో ఉందని అన్నారు. నిజామాబాద్ పసుపు బోర్డు ప్రయత్నిస్తామని చాలాసార్లు అన్నారని, మొత్తానికి ప్రకటించడం శుభపరిణామం అన్నారు.అది రైతులు ఎప్పటినుంచో కోరుతున్నదని అయితే బోర్డు ప్రకటించడమే కాదు దానికి తగినన్ని నిధులు ఇవ్వాలని అలాగే పసుపుకి మద్దతు ధర లేదని పసుపుకి మద్దతు ధర వచ్చేలాగా ఈ బోర్డు ప్రయత్నం చేయాలన్నారు. దీంతోపాటు జీడి, కొబ్బరి, కాఫీ బోర్డులు, ఆయా పంటల ధరలు తగ్గినప్పుడు అవే స్వయంగా పంటను కొని అంతర్జాతీయ మార్కెట్లోకి ఎగుమతి చేసే పరిస్థితి ఉందని పసుపు విషయంలో ఈ బోర్డు కూడా అలా చేస్తే మంచిదని దీంతోపాటుగా పరిశోధన మరింత పెంచి రైతుకు ఉపయోగ పడాలని సూచించారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారు, వినియోగదారు, ఎగుమతిదారు కూడా. 2022-23 సంవత్సరంలో 11.61 లక్షల టన్నులతో ప్రపంచంలో మూడింట రెండో వంతు పసుపు భారత్ ఉత్పత్తి చేయగా, పసుపులో ప్రపంచ వాణిజ్యంలో భారత్ కు 62% వాటా ఉందని, 2022-23లో భారత్ నుంచి వివిధ దేశాలకు 1.534 లక్షల టన్నుల పసుపు, పసుపు ఆధారిత ఉత్పత్తులు ఎగుమతయ్యాయన్నారు. అయితే ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేయడంలో మాత్రం రాజకీయ కోణం ఉందని, బి ఆర్ ఎస్ పార్టీ ఆడిగితేనో లేక కవిత అడిగితే మేము పసుపు బోర్డు ఇవ్వాలా అనే ఉద్దేశ్యంతోనే ఇన్ని రోజులు ఇవ్వలేదని అన్నారు. కానీ కవిత నిజాయితీగా చేసిన పోరాటం కృషి ని కాదు అనలేమన్నారు. పసుపు బోర్డు ఏర్పాటులో జాప్యం అయిన, రాజకీయ కోణం ఉన్న ఇప్పటికైనా ఏర్పాటు చేయడం అభినందనీయం తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News