- సేవాలాల్ సేన కోదాడ నియోజకవర్గ కార్మిక శాఖ అధ్యక్షుడు బానోతు శంకర్ నాయక్
నేటి సాక్షి, కోదాడ ప్రతినిధి : ఈ నెల 15 వ తారీకున జరగనున్న శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతినీ ఐచ్చిక సెలవు దినం కాకుండా సాధారణ సెలవు దినంగా ప్రకటించాలని సేవాలాల్ సేన కార్మిక శాఖ అధ్యక్షుడు బానోతు శంకర్ నాయక్. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… కోదాడ నియోజకవర్గంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో శ్రీ సంత్ సేవలాల్ జయంతి జరుపుకోవాలని కోరారు. జిల్లాలో సేవాలాల్ మహారాజ్ కమ్యూనిటీ హాల్ కట్టించాలి. అని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం జయంతికి ప్రతి జిల్లాకు రెండు కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.





