- బండారు రవికుమార్, TAGS రాష్త్ర ఉపాధ్యక్షులు
- రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరుతూ

నేటి సాక్షి, కుమురం భీం ఆసిఫాబాద్ : జిల్లా కలెక్టరెట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి (DRO) గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ గారు మాట్లాడుతూ ఆదివాసిల జిల్లా కుమురం భీం జిల్లాలో వ్యవసాయ అధికారుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు రుణమాఫీ ఆదివాసి జిల్లాలో సక్రమంగా అమలు కాలేదని ఆరోపించారు. దీనికి ప్రధాన కారణమైన వ్యవసాయ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రం కి పది కిలోమీటర్ల దూరం పరిధిలో ఉన్న గ్రామాలలో కూడా రుణమాఫీ అమలు కాకపోతే దూర ప్రాంతాల రైతుల పరిస్థితి ఎంటా అని ప్రశ్నించారు. వట్టి వాగు కు చెందిన పేద ఆదివాసి మహిళా రైతు కొరెంగ బూర్జు భాయి పేరును వ్యవసాయ అధికారులు వాళ్ల రికార్డుల లో భాను భాయిగా మార్చడంతో ఆమె రుణమాఫీ కాక ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కౌటా గూడ గ్రామానికి చెందిన ఆత్రం బాపూరావు కుటుంబానికి మూడు లక్షల ఇరవై వేల రుణం ఉండటంతో అధికారులు లక్ష ఇరవై వేలు క కట్టమని సూచించడంతో వాళ్లు అప్పులు చేసి ఆ రుణము కట్టారు కానీ వాళ్ళది రుణమాఫీ కాలేదు. ఈ రకంగా అనేకమంది ఆదివాసీలు ఎస్సీ, బీసీ, ఇతర పేద రైతుల రుణాలు మాఫీ కాకపోవడం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు ఒక ఆదివాసి మహిళ ఆదివాసి జిల్లా కోసం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని తప్పులు చేసిన వ్యవసాయ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని, రైతులందరికీ వెంటనే రుణమాఫీ అయ్యేలా చూడాలని లేనిపక్షంలో జనవరి 31 తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు కొరెంగ మాలశ్రీ, జిల్లా ఉపాధ్యక్షులు కోట. శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి మాడవి గణపతి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి చాపిలె సాయి కృష్ణ, డివైఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ చాపిడి శ్రావణి, జిల్లా ఉపాధ్యక్షులు చాపిడి పురుషోత్తం, సిపిఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, టీఏజిఎస్ నాయకులు మరప హన్మంతు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్, ఐద్వా జిల్లా కార్యదర్శి దుర్గం అనిత, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.





