Saturday, March 14, 2026

ఒంటరి మహిళకు కుట్టు మిషన్ పంపిణీ

  • సామాజిక కార్యకర్త పులి రాజు

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా 27 : ఒంటరి మహిళకి కుట్టుమిషన్ అందించిన పులిరాజు వివరాల్లోకి వెళితే వనపర్తి జిల్లా పానగల్ మండలం అన్నారం గ్రామానికి చెందిన దాసరి పద్మ తనభర్త దాసరి వేంకటయ్య ఒక ప్రమాదం లో పదిసంవత్సరాల క్రితం మరణించాడు. అప్పటి నుంచి తన ఇద్దరూ పిల్లలని చదివించుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. పద్మకు వచ్చిన టైలరింగ్ పని తోనే ఇద్దరి పిల్లలను పోషించుకుంటుంది. పద్మ కుటుంబానికి కుట్టుమిషనే ఆధారం అయినది. ఆ పాత మిషన్ చెడిపోవడం తో తను ఇబ్బంది పడుతోందని విషయం తెలుసుకున్న కామన్ మ్యాన్ హెల్పింగ్ హాండ్స్ ప్రతినిధులు బాలకృష్ణ తన మిత్ర బృందం ప్రముఖ సామజిక కార్యకర్త అయినా పులిరాజు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఆమెకి ఈరోజు కుట్టుమిషన్ ఇప్పించడం జరిగింది. ఈసందర్బంగా పులిరాజు కి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 5 వాతేదీన సిద్ధిపేట జిల్లాలో ఆకలి చావుల కుటుంబం గురించి వీరే ప్రపంచానికి వీడియో ద్వారా తెలియజేశారు. ఇప్పుడు ఇలా విరి సేవలను పలువురు కొనియాడారు . ఈ కార్యక్రమం లో కామన్ మ్యాన్ హెల్పింగ్ హాండ్స్ ప్రతినిధులు బాలక్రిష్ణ, శేఖర్, వంశి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News