- అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి ఉత్సవాలు
- రాజన్న భక్తులకు అల్పాహారం పంపిణీ
- భక్తుల సౌకర్యార్ధం బస్సును ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్


నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ) : అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి ఉత్సవాల ప్రారంభం అయ్యాయాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. మంగళవారం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజన్న భక్తులకు ఉచిత అల్పాహారాన్ని, ఉచిత బస్సు ను ప్రారంభించారు.. వారు మాట్లాడుతూ రాజన్న భక్తులు ఉచిత అల్పాహారాన్ని వినియోగించు కోవాలన్నారు..భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రుల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచనల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆలయ అధికారులు, అన్ని శాఖల అధికారులు పలుమార్లు సమావేశం ఏర్పాటు చేసుకొని మహాశివరాత్రి జాతర వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బంది కాకుండా మెరుగైన వసతులు కల్పించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని పేర్కొన్నారు… రాజన్న భక్తులకు తిప్పాపూరు. నుండి ఉచిత బస్సు సౌర్యాన్ని కల్పించామని భక్తులందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు..రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఈ జాతరకు తరలి రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆలయా అధికారులు సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రాజన్న భక్తులకు శీఘ్ర దర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సాయంత్రం ఏడు గంటలకు స్వామివారికి పట్టు వస్త్ర సమర్పిస్తారని తదుపరి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పట్టు వస్త్ర సమర్పిస్తారని పేర్కొన్నారు..పెద్ద ఎత్తున రాజన్న భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించు స్వామి వారి సేవలో తరించాలని కోరారు.





