Saturday, March 21, 2026

ఘనంగా శివాజీ మహారాజ్ వేడుకలు

నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి) : కోరుట్ల గాంధీ రోడ్ (కార్గిల్ చౌరస్తా) వద్ద 395 వ శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిప్ప మహంత్ మాట్లాడుతూ, స్వేచ్ఛ అనేది ఒక వరం, దీనిని అందరూ పొందే హక్కు ఉంది.” “ఎప్పుడూ తల వంచకండి” అని నినాదిస్తూ మొగలుల చేతిలో చిక్కుకుపోయిన భారతదేశాన్ని, జై దుర్గా భవాని అంటూ ఎంతో సమయస్ఫూర్తితో చాకచక్యంతో భారతదేశానికి భారతదేశంలోని ప్రజలకు స్వేచ్ఛను అందించడంతో పాటు మన దేవాలయాలను భారతదేశ సంపదను కూల్చివేయకుండా రక్షించి భారతదేశ ఉనికిని గొప్పతనాన్ని రక్షించాడు. ఒకడిగా ప్రారంభించి దేశమంతా ఒక్కటై గర్జించేలా చేసిన శివాజీ మహారాజుని ఆదర్శంగా తీసుకొని, నేటి యువత మన దేశాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచడానికి, స్వేచ్ఛ సమానత్వం అనే హక్కులను కాపాడేలా ప్రతిభను పెంచుకొని, భారతదేశాన్ని చరిత్రపుటల్లో గొప్పగా మలుస్తారని ఆశిస్తూ, చత్రపతి శివాజీ మహారాజ్ కీ జై అంటూ ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో దేశముఖ జీవన్, మహి వాస్, మహాదేవ్, తరుణ్, శివ, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News