- వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద
- ఎన్ ఎన్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో స్ఫూర్తి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్.
- విద్యార్థులతో కలిసి పక్షి షార్ట్ ఫిలిం వీక్షించిన కలెక్టర్
- 15 ఏళ్లలో ప్రపంచాన్ని శాసించే స్థాయి లో భారత యువత…
- 10వ తరగతిలో 9.7 జీపీఏ సాధించే విద్యార్థులతో కలసి భోజనం చేస్తానన్న కలెక్టర్

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : విద్యార్థుల్లో మానసిక దృఢత్వాన్ని పెంపొందించడానికే “స్ఫూర్తి” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ డా..సత్య శారద అభిప్రాయపడ్డారు. శనివారం వరంగల్ నగర పరిధి ఎన్ ఎన్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో జరిగిన స్ఫూర్తి కార్యక్రమంలో కలెక్టర్ సత్య శారద, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి తో కలసి హాజరైనారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించి వారు భవిష్యత్తులో ఏం కావాలనుకున్నారో అడిగి తెలుసు కున్నారు. విద్యార్థులు నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని కనుగుణంగా క్రమ శిక్షణతో ఇష్టపడి చదవాలన్నారు. పదవ తరగతిలో 9.7 జీపీఏ సాధించే విద్యార్థులతో కలసి భోజనం చేస్తానని కలెక్టర్ చెప్పారు.
విద్యార్థులు భయం వీడితే ఏదైనా సాధించగలరని జిల్లా స్థాయి లో పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నెలకొల్పే విధం గా ప్రేరణ కలిగిస్తున్నామని తెలిపారు.వచ్చే 15 ఏళ్లలో ప్రపంచాన్ని శాసించే స్థాయిలో భారత యువత నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆ స్థాయిలో తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వినియోగించి నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. మొబైల్ ఫోన్లను, సాంకేతికతను (టెక్నాలజీ) అవసరం మేరకే వినియోగించు కోవాలని, అధికంగా వినియోగిస్తే బానిస గా మారి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. విద్యార్థులకు సాయంత్రం వేళలో అందించే స్నాక్స్ ను రుచి చూసిన కలెక్టర్ బాగుందని అభినందించారు. విద్యార్థులు ఈవ్ టీజింగ్కు గురి అవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా స్పందించిన కలెక్టర్ ఏ సి పి తో చర వాణి లో మాట్లాడి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భం గా విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్స్ రైటింగ్ ప్యాడ్స్ ను కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమం లో డి ఆర్ డి ఓ కౌసల్య ఆర్ డి ఓ సత్య పాల్ రెడ్డి ఏం ఆర్ ఓ. ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.





