- వెలుగు నీడ స్వచ్చంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మోరే గణేష్,
- దళిత బంధు ఆత్మ గౌరవ సంక్షేమ సంఘము
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరపెల్లి శివప్రసాద్..
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల ఎమ్మెల్సీగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వెలుగు నీడ స్వచ్చంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మోరే గణేష్ దళిత బంధు ఆత్మ గౌరవ సంక్షేమ సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరపెల్లి శివప్రసాద్ పిలుపు నిచ్చారు. శంకరపట్నం మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు కోసం డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు భారతదేశంలో చాయ్ వాలా ప్రధాని అయినపుడు ట్యూషన్ టీచర్ ఎమ్మెల్సీ కాకూడదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యతో రాష్ట్ర పేరెంట్స్ ను ఆర్థికంగా దోచుకుంటున్న క్రమంలో పేద మధ్య తరగతి విద్యార్థులకు అందుబాటులో ఉంటూ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల నెలకొల్పి వేలాదిమంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్ది దేశంలోని ముఖ్యమైన వైద్య విద్యలో ఐఐటి కళాశాలలో ప్రముఖ ఉద్యోగ సంస్థల్లో అగ్రశ్రేణిలో నిలబెట్టడానికి తన వంతు కృషిచేసి విద్యార్థుల భవిష్యత్తు తన భవిష్యత్తుగా భావించి శ్రమించిన నరేందర్ అన్న ఎమ్మెల్సీగా గెలిస్తే పట్టబద్దుల హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడి హక్కులు సాధిస్తారని గణేష్ వివరించారు. కరీంనగర్ జిల్లా తో పాటు చుట్టుపక్కల ఉన్న విద్యార్థులంతా నరేందర్ సార్ ట్యూషన్ చెప్తేనే తాము విద్యలో రాణిస్తామని భావనతో వందలాదిగా సార్ ట్యూషన్ లో చేరిన విద్యార్థుల భవిష్యత్తు కోసం తను పీహెచ్డీ లాంటి ఉన్నత విద్యను త్యాగం చేసి తన విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దిన త్యాగశీలి నరేందర్ అన్నని కొనియా డారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన మొదలైన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆల్ ఫోర్స్ నరేందర్ అన్నను గెలిపించి ప్రజా పాలనను మరింత ముందుకు తీసుకుపోవాలని కోరుతూ శంకరపట్నo మండల కేంద్రంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమం లొ యువజన. స్వచ్చంద సేవ సంస్థల నాయకు లు కార్యకర్తలు పాల్గొన్నారు





