- లేదా వేలం వేస్తాం
- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల (కోక్కుల వంశీ) : జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను మరియు వివిధ సందర్భలలో సీజ్ చేయబడిన 64 వాహనాల యజమానులు 6 నెలలలోపు సరైన పత్రాలు చూపెట్టి అట్టి వాహనాలను తీసుకవేళ్ళచు అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లలో పలు సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు,యజమానులు తీసుకోకుండా ఉన్న వాహనాలు,గుర్తు తెలియని 64(ఆటోలు 06, కార్స్ 03, ద్విచక్రవాహనాలు 55.)వాహనాలను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి తరలించడం జరిగిందని, అట్టి వాహనాల యజమానులు ఆరు నెలల వ్యవధిలో సరైన ధృవ పత్రాలను చూపించి తిరిగి తీసుకోవచ్చని,ఒకవేళ వాహన యజమానులు లేనియెడల వారి కుటుంబ సభ్యులు సరైన పత్రాలు చూపెట్టి తీసుకవేళ్ళచు అని, లేని పక్షంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి 6 నెలల తరువాత వాహనాలను వేలం వేయడం జరుగుతుంది అని అన్నారు. వాహన యజమానులు సంబంధిత పత్రాలతో ఈ రోజు నుండి ఆరు నెలల లోపు తడూర్ నందు గల పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మోటార్ వెహిల్ సెక్షన్ నందు సంప్రదించాలని ఇతరత్రా సమాచారం కోసం 87126 56428 ,90009 10619 ఫోన్ నంబర్లలను సంప్రంచాలని తెలిపారు. త్వరలోనే వేలం తేదీ ప్రకటన చేస్తామని తెలిపారు.





