Sunday, March 22, 2026

కరాటే విజేత విద్యార్థినిల ను అభినందించిన ఎస్సై సందీప్

నేటిసాక్షి, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రభుత్వ మోడల్ స్కూల్. జూనియర్ కళాశాల విద్యార్థినిలు కరాటే పోటీలలో ప్రతిభ సాధించిన విద్యార్థినిలను ఎస్సై సందీప్ అభినందించి ప్రశంసించారు. స్కూల్ లో జరిగిన కరాటే ప్రతిభ ప్రదర్శన చూశారు. ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో పాల్గొని ప్రతిభను కనపరచిన విద్యార్థినిలకు మెడల్స్ అందచేశారు. అలాగే హైదరాబాద్ సరూర్ నగర్ ఎల్ బి ఆర్ స్టేడియంలో జరిగిన ఫోర్త్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ లో పాల్గొన్న నాచుపల్లి గ్రామానికి చెందిన 8 మంది బాలికలు. మరిన్ని పోటీల్లో పాల్గొని విజయం సాధించి పాఠశాలకు.తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకు రావాలని కోరారు. కరాటే మాస్టర్ కు శాలువాతో సన్మానించారు. విద్యార్థులకు కరాటే మెలకువలు నేర్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి లావణ్య, కరాటే మాస్టర్ బరిగే లక్ష్మీరాజం, పీ.డి. అనూప్ రెడ్డి, ఉపాధ్యాయబృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News