
నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : రాబోయే పదవ తరగతి పరీక్షల గురించి గొల్లపల్లి మండలంలో గల మోడల్ స్కూల్ లో పదవ తరగతి పరీక్ష రాయబోయే విద్యార్థిని ,విద్యార్థులకు పరీక్షల గురించి అవగాహన కల్పించి, తగిన సూచనలు తెలియజేసిన గొల్లపల్లి ఎస్ఐ చిర్ర సతీష్ ఇట్టి అవగాహన కార్యక్రమంలో గొల్లపల్లి ఎస్ఐ చిర్ర సతీష్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థిని, విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన, ఎలాంటి భయాందోళనలు లేకుండా, సానుకూల దృక్పథంతో, ప్రశాంతమైన ఆలోచనతో, మనోధైర్యంతో, విద్యార్థిని విద్యార్థులు అందరూ పరీక్షలకు హాజరై పరీక్షలు రాయాలని పరీక్షలు విజయవంతంగా ముగించుకొని, ఉత్తీర్ణులై ఉన్నత స్థాయి శిఖరాలకు ఎదగాలని సూచించినారు. ఇట్టి కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సుంకర రవికుమార్ అధ్యాపక బృందం మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



