- ఆరుగురు అరెస్ట్, ఇద్దరు పరారీ
నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని దాచారం గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఫిబ్రవరి 21 రాత్రి సిద్దిపేట టాస్క్‌ఫోర్స్ మరియు బెజ్జంకి పోలీసులు సంయుక్త దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుండి ₹6,480 నగదు, 5 మొబైల్ ఫోన్లు, 3 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు.వీరిలో దూరశెట్టి రాజిరెడ్డి, నివాసం: గుగ్గిళ్ళ,దయ్యాల నరేష్, నివాసం: దాచారం, మెరుగు శ్రీనివాస్, నివాసం: గుగ్గిళ్ళ,బండి రాజ్‌కుమార్, నివాసం: గుగ్గిళ్ళ,ఏనుగుల కిషన్, నివాసం: దాచారం,కాయిత రమేష్, నివాసం: గుగ్గిళ్ళ గార్లను అదుపులోకి తీసుకున్నారు.మేకల శ్రీకాంత్, నివాసం: బెజ్జంకి,తులిశాల శేఖర్, నివాసం: గుగ్గిళ్ళ పరారీలో ఉన్నారు.వీరిపై బెజ్జంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామాలు, పట్టణాలు, ఫామ్ హౌస్‌లు, ఇళ్లలో పేకాట లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంటే, సిద్దిపేట టాస్క్‌ఫోర్స్ అధికారుల ఫోన్ నంబర్లు 8712667445, 8712667446, 8712667447 కు తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.





