- వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయించిన ఎమ్మెల్యే
- స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి


నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : వనపర్తి నియోజకవర్గంలో వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది.500 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, పెబ్బేర్ లో 30 పడకల ప్రభుత్వాసుపత్రికి శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. 100 గ్రామాలకు గ్రామీణ రోడ్లను మంజూరు చేసిన సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు.ఆదివారం శంకుస్థాపన చేసిన ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ కు మాజీ ఎమ్మెల్యే జయరాములు యాదవ్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రిని కోరిన ఎమ్మెల్యే. 500 పడకల హాస్పిటల్కు మాజీ ఎమ్మెల్యే డా. బాలకిష్టయ్య పేరు పెట్టాలని ముఖ్యమంత్రిని కోరిన ఎమ్మెల్యే.జిల్లాలో సంక్షేమ హాస్టల్ ప్రైవేట్ భవనాలు ఉన్నాయని వాటికి పక్క భవనాలు నిర్మించినందుకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. పాలిటెక్నికళాశాలకు రేన్యువేశన్ చేసేందుకు నిధులు మంజూరు చేసి కళాశాలకు పూర్వ వైభవం తీసుకురావాలని ముఖ్యమంత్రి కోరారు.జేఎన్టీయూ కళాశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి. జిల్లాలోని 133 గ్రామపంచాయతీలు రెండు మున్సిపాలిటీలకు ఎస్.డి.ఎఫ్. కింద నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ముఖ్య మంత్రి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి నిధులు మంజూరు చేయాలని కోరారు.




