Friday, March 13, 2026

సింగరేణి కార్మికుల సొంతింటి పథకం అమలు చేయాలి

  • ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
  • మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే వినతి పత్రం

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- సింగరేణి కార్మికుల సొంతింటి పథకం అమలు చేయాలని, సింగరేణి కార్మికులకు ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు సొంత ఇల్లు లేక దిగిపోయిన తరువాత అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిపై సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. కార్మికుల ఈ ప్రధానమైన సమస్యపై ఏడోదఫా జరిగిన సింగరేణి ఎన్నికల ముందు సొంతింటి పథకం ప్రాధాన్యతను గుర్తించిన అన్ని కార్మిక సంఘాలు ప్రధాన ఏజెండాగా కార్మికులకు వాగ్దానం చేశాయని, అంతేకాకుండా అనేక పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకాన్ని అమలు చేస్తామని వాగ్దానం చేసిన విషయం విధితమే అని అన్నారు. ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల కార్మికునికి సొంతింటి కల నెరవేర్చడంతో పాటు పెర్స్ ఇన్కం టాక్స్ సమస్య కూడా సింగరేణి సంస్థకు ఎలాంటి భారం పడకుండా పరిష్కారం అవుతుందని తెలిపారు. అలాగే సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. సింగరేణి కార్మికులకు సొంతింటి పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, ఎస్సిఈయు శ్రీరాంపూర్ డివిజన్ అధ్యక్షుడు గూళ్ల బాలాజీ, ఆర్గనైజేషన్ సెక్రటరీ వెంగళ శ్రీనివాస్, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కస్తూరి చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి శ్రీను, మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ రాజేందర్, కాసిపేట ఫిట్ సెక్రెటరీ సురేష్, ఆర్ జీవన్ బ్రాంచ్ అధ్యక్షుడు రాజమౌళి, ఆర్కే సీక్ ఫిట్ సెక్రటరీ శైల శ్రీనివాస్, ఆర్కే సెవెన్ ఫిట్ సెక్రటరీ శ్రీధర్, నరేష్, లక్ష్మణ్, తిరుపతి, సుధాకర్, నరహరి, రాజగోపాల్, ఆర్కే సెవెన్ ఏ ఫిట్ సెక్రటరీ సదానందం, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News