నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ: దేవుడి ముందు అందరూ సమానమే. సామాన్యులకైనా, సెలబ్రిటీలకైనా ఆ పరమాత్ముడు ఒక్కడే. కానీ, ఆ దేవుడిని దర్శించుకునే విషయంలో మాత్రం చాలా తేడాలున్నాయి. సామాన్యులు దేవుడిని దర్శించుకుంటే అది సర్వసాధారణం. కానీ, సెలబ్రిటీలు దేవుడి దర్శనం కోసం వెళ్తే అది విశేషం. అందులోనూ సినిమా సింగర్ దైవ దర్శనం చేసుకుంటే అక్కడున్నవాళ్లకు అది ఆసక్తికరం. ఇలాంటి ఆసక్తికర ఘటన గురువారం తిరుమలలో జరిగింది.
తిరుమల శ్రీవారిని పుష్ప సినిమా రా రా స్వామి ఫెమ్ సింగర్ మామిడ్ల మౌనిక యాదవ్ గురువారం కుటుంబం సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకోగానే అర్చకులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం అర్చకులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు.