- పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
- విద్యార్థులకు బోధిస్తున్న అంశాల పై ఆరా
- పాఠశాలలోని వంటశాల, స్టోర్ గది సందర్శన
- నేరెళ్ల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల ( కోక్కుల వంశీ ) : విధి నిర్వహణలో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే కలెక్టర్ ఒక్కసారిగా టీచర్ అవతారమెత్తి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ అరుదైన ఘటన రాజన్న జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా కలెక్టర్ హే తమకు పాఠాలు చెప్పడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మధ్యాహ్న భోజనాలు సిద్ధం చేసే గది, వండే విధానాన్ని పరిశీలించారు.

మెనూ ప్రకారం ప్రతి రోజు ఏ ఏ ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారో ఆరా తీశారు. కూరగాయలు పప్పు, కోడిగుడ్లు సిద్ధం చేస్తుండగా, నాణ్యతను తనిఖీ చేశారు.ఈ రోజు ఎందరు విద్యార్థులు, టీచర్లు హాజరయ్యారో ఆరా తీయగా, మొత్తం 84 మంది విద్యార్థులు, అందరూ టీచర్లు వచ్చారని కలెక్టర్ దృష్టికి ప్రధానోపాద్యాయులు విద్యాసాగర్ తీసుకెళ్లారు మరియు విద్యార్థులకు బోధన పాఠశాల లోని 6వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు గదులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విద్యార్థులతో మాట్లాడుతూ.. పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. 10 వ తరగతి విద్యార్థుల కు మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ పాఠాలు బోధించారు. విద్యార్థులకు మ్యాథ్స్ ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టి విద్యార్థులను ఉత్తేజ పరిచారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులను సిద్ధం చేయాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రతి పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా వివరించాలని ఉపాధ్యాయులకు సూచించారు.





