నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : నిరుద్యోగులు స్వయం ఉపాధిని కల్పించుకొని నలుగురికి ఉపాధి అవకాశాలు కల్పించాలని గద్వాల్ రూరల్ ఎస్సై శ్రీకాంత్ మరియు ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు సూచించారు. బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో టీ వనం సెంటర్ షాప్ యజమానులు నరేష్,కిరణ్ కుమార్ తో కలిసి టీ సెంటర్ ను ఎస్సై లు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సుచి, శుభ్రతతో కూడిన రుచికరమైన టి, అందజేసి వినియోగదారులను ఆకట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్, నరేష్ కుమార్, పాండు ముదిరాజ్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు