Sunday, March 22, 2026

ఎస్ ఐ నిర్లక్ష్యం… మృతదేహం కోసం బంధువులు ఎదురుచూపులు

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల): రామచంద్రాపురం, తిరుపతి జిల్లా రామచంద్రాపురం ఎస్ఐ రామాంజనేయులు, రైటర్ సురేష్ నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతదేహానికి పోస్టుమార్టం నిలిచిపోయింది. 15వ తేదీ పోలీస్ స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదంలో కృష్ణమ నాయుడు గాయపడ్డాడు. పోలీసులు 108లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో యం ఎల్ సి ( మెడికల్ లీగల్ కేసు) నమోదు నమోదైంది. చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం కృష్ణమ నాయుడు మృతి చెందాడు. మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు డాక్టర్స్ ను ప్రాధేయపడ్డారు. ఎం ఎల్ సి నమోదైంది.. ఎఫ్ ఐ ఆర్ తీసుకువస్తే పోస్ట్ మార్టం చేసి మృతదేహాన్ని అప్పగిస్తామని డాక్టర్లు తెలిపారు. దీంతో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయమని కుటుంబ సభ్యులు స్టేషన్ కు వెళ్లారు. 15 మంది వచ్చి ఫిర్యాదు చేయాలని ఎస్ఐ, రైటర్ ఆదేశించారని వదిన కూతురైన కుమారి ఆవేదన వ్యక్తం చేసింది. మృతదేహం కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ఎదురుచూస్తున్నారు. మృతుడు కృష్ణమనాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీప బంధువు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News