- ఒక బైక్ 40 లీటర్లు గుడుంబా స్వాధీనం

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) :
గుడుంబా నిర్ములన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా డిప్యూటీ కమీషనర్ అంజన్ రావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారు ఝామున రూట్ వాచ్ నిర్వహించి నందనాయక్ తండా నుండి గీసుకొండ కు బైక్ పై గుడుంబా రవాణా చేస్తున్న భూక్యా రాజు, భూక్యా మమత లను అరెస్ట్ చేసి వారివద్ద నుండి ఒక బైక్, (20) లీటర్ల గుడుంబా ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ మేరకు జాన్ పాక లో దాడులు నిర్వహించి గుడుంబా అమ్ముతున్న వాంకుడోత్ అఖిల్, గండ్రకోట విజయ,తేజవత్ సురేష్, తేజవత్ కస్నా అనే నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి (20) లీటర్ల గుడుంబా నాలుగు మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. దాడులలో ఎక్సైజ్ సీఐ తాతాజీ, ఎస్సైజ్యోతి, పద్మ సిబ్బంది లక్ష్మణ చారీ, శ్రీనివాస్, సత్తయ్య పాల్గొన్నారు.




