Friday, March 20, 2026

ఎం.జె.పి.లో ఆరుగురు విద్యార్థుల అస్వస్థత

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు):
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం లోని జయగిరి మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో శుక్రవారం రాత్రి ఆరుగురు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు సాయంత్రం భోజనం తిన్న తర్వాత విద్యార్థులు గురుకుల ఆవరణలో ఉన్న బాదం చెట్లు పచ్చి బాదం పప్పు తిన్నట్లు తెలిపారు బాదం పప్పు తిన్న 5 వ తరగతికి చెందిన చందు, హరికృష్ణ, సచిన్, సుశాంత్, రిషిత్ కుమార్, సామ్యూల్ భార్గవ్, అనే ఆరుగురు విద్యార్థులు వాంతులు చేసుకోవడం తో ప్రిన్సిపల్ వెంకట ప్రసాద్ హుటా హుటిన అంబులెన్స్ లో ఎంజీఎం కు తరలించారు. అప్రమత్తమైన డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య విద్యార్థుల పరిస్థితిని గమనించి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు ప్రస్తుతం ఆరుగురు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డిఎంహెచ్వో వెల్లడించారు. ఈ విషయంపై ప్రిన్సిపల్ వెంకట ప్రసాద్ ను వివరణ కోరగా జరిగిన విషయంపై కలెక్టర్ కి డిఎంహెచ్వో కు సమాచారం అందించామని ప్రస్తుతం ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ లేదని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News