Tuesday, March 10, 2026

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు స్నాక్స్

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక స్టడీ అవర్స్ ను గత నెల రోజులనుండి కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం స్టడీ అవర్స్ కు హాజరయ్యే విద్యార్థులకు ఆకలి నుండి ఉపశమనానికి గాను కళాశాల అధ్యాపకుల ఆర్థిక సహాకారంతో మంగళవారం సాయంత్రం విద్యార్థులకు స్నాక్స్ ను కళాశాల ప్రిన్సిపాల్ వి. అంజనేయరావు అందజేశారు. ఈ సందర్భముగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు మీరు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరుతో పాటు, మీకు ఏమన్నా సందేహాలు ఉంటే సంబధిత అధ్యాపకులతో నివృత్తి చేసుకొని వందశాతం ఫలితాలు సాధించాలి అని తెలిపారు. ఇట్టి కార్యక్రమం లో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News