- మహిళలు అన్ని రంగాల్లో రాణించా లి
- సమాజంలో ప్రతి ఒక్కరూ మహిళా సాధికారతకు తోడ్పడాలి
- జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
నేటి సాక్షి మహబూబాబా ద్ నర్సింహులపేట భూక్యా రవి : శుక్రవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశం మందిరంలో స్త్రీ, శిశు సంక్షేమ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, మాట్లాడుతూ.. మహిళలు విద్య, ఉపాధి రంగాల్లో లింగ సమానత్వం, మహిళా సాధికారత, సాధించాలనీ, మహిళల హక్కులను కాపాడడం సామాజిక, సాంకేతిక రంగాల్లో పురోగతిని ప్రోత్సహించాలని, విద్య ఉపాధి భద్రత వంటి రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా మహిళలు ముందుంటారని, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక స్వావలంబన, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఒక మహిళ విజయవంతురాలు అయితే కుటుంబంతో పాటు సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని, మహిళల మేధాశక్తి చాలా గొప్పదన్నారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. వీరబ్రహ్మచారి, లు మాట్లాడుతూ.. సమాజం, కుటుంబం నిజమైన అభివృద్ధి చెందాలంటే మహిళల చేతుల్లోనే ఉంటుందని అన్నారు, కృత్రిమ మేధస్సు, డిజిటల్ రంగాలలో మరింత ప్రోత్సాహం అవసరమని అన్నారు. వేడుకలకు హాజరైన డిఎంహెచ్వో డాక్టర్ మురళీధర్, సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ నాగవాణి, డి ఎ వో విజయనిర్మల, జిల్లా వెల్ఫేర్ అధికారిని ధనమ్మ, షీ టీమ్స్ సబ్ ఇన్స్పెక్టర్ సునంద, సిడబ్ల్యుసి మెంబర్ పి.అశోక్, జయశ్రీ, లక్ష్మి, సిడిపిఓలు శిరీష, నిలోఫర్, ఎల్లమ్మ, కమలాదేవి, తదితరులు మహిళా సాధికారత అభివృద్ధిపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపన్యాసాలు, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల ప్రదర్శన, మహిళ ఉత్తమ ఉద్యోగులకు బహుమతుల ప్రధానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.



