- తెలంగాణ జన సమితి కార్మిక విభాగం కన్వీనర్ ఆకుల శ్రీనివాస్
నేటిసాక్షి, హైదారాబాద్ : బస్తీ దవాఖనలలో పని చేస్తున్న సపోర్టింగ్ స్టాప్ సమస్యల పరిష్కారం కొరకు కమిషనర్ వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ కు వినతి పత్రమును అందజేయడం జరిగింది.వివిధ జిల్లాలలో బస్తీ దవాఖాన సపోర్టింగ్ స్టాప్ కు గత 4 నెలల నుండి 7 నెలల వరకు వేతనాలు రావాల్సి ఉన్నాయి. హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల యొక్క సపోర్టింగ్ స్టాప్ కు బ్లడ్ శాంపిల్స్ రవాణా అలవెన్సులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు రావడం జరిగింది.గతంలో బస్తీ దవాఖనలలో కాంట్రాక్టు విధానములో పనిచేస్తున్న సపోర్టింగ్ స్టాఫ్ ను ఏజెన్సీలకు అప్ప జెప్పడం సరికాదని నిర్ణయాన్ని అమలు చేయుటను నిలుపుదల చేయాలని అధికారులను కోరారు.పెరిగిన వేతనాలు బకాయిలతో వెంటనే సంబంధిత సపోర్టింగ్ స్టాఫ్ కు చెల్లించాలని ఆయన అధికారులను కోరారు.
ఇతర శాశ్వత మరియు తాత్కాలిక నియమకాల్లో బస్తీ దవాఖాన సపోర్టింగ్ స్టాప్ కు పూర్తి వయస్సు సడలింపు ఇస్తూ సర్వీసు వెయిటేజ్ మార్కులకు కూడా ఇవ్వాలని మరియు ఇతర సపోర్టింగ్ స్టాఫ్ సమస్యలను కమిషనర్ కార్యాలయ అధికారుల దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలంగాణ జన సమితి కార్మిక విభాగం కన్వీనర్ ఆకుల శ్రీనివాస్ తెలిపారు అధికారులు సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేసినట్లు ఆకుల శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాల బస్తీ దవాఖాన సపోర్టింగ్ స్టాఫ్, బస్తీ దవాఖన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు సుమన్, అనిత ,అంజాద్ అలీ ఖాన్ ,మెతుకు ఉప్పలయ్య, ఆర్ నరసింహ ,నరసింహ రెడ్డి, హారిక, మంజుల, పద్మ లావణ్య, పావని, శాంతమ్మ, స్వప్న, అశ్విని, అఖిల్, జి.హెచ్.ఎం.సి, టీ.జె.ఎస్.కే.వి ప్రతినిధులు పాల్గొన్నారు.

