Wednesday, April 1, 2026

గ్రూప్-2 పరీక్షలో 25వ ర్యాంక్ సాధించిన ఎస్‌.ఐ. శివ‌ను సన్మానించిన ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

నేటి సాక్షి మహబూబాబాద్ భూక్యా రవి మార్చి 13

గ్రూప్-2 పరీక్షలో ప్రతిభ చూపించి 25వ ర్యాంక్ సాధించిన ఎస్‌.ఐ. శివ‌ను జిల్లా పోలీస్‌ అధికారి శ్రీ సుధీర్ రాంనాధ్ కేకన్, IPS గారు అభినందించి ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, క్రమశిక్షణ, కఠిన సాధన, పట్టుదల ఉంటే ఏ లక్ష్యమైనా సాధించవచ్చని తెలిపారు.మహబూబాబాద్ టౌన్ ఎస్సై శివ‌ తన విధులను నిర్వహిస్తూ చదువుపై ఆసక్తి కనబరచి ఉన్నత ర్యాంక్ సాధించడం ఇతర పోలీస్‌ అధికారులకు ప్రేరణగా నిలుస్తుందని ఎస్పీ ప్రశంసించారు. ఈకార్యక్రమంలో ఏ.ఆర్ డిఎస్పీ శ్రీనివాస్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్.బి ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, డీసీఆర్బిఇన్స్పెక్టర్సత్యనారాయణ,టౌన్ సీఐ దేవేందర్, ఆర్.ఐలు నాగేశ్వర్రావు, అనిల్, పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News