Friday, March 20, 2026

జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలి

  • జిల్లాలో ఎక్కడ కూడా బాల్య వివాహాలు జరగకుండా చూడాలి
  • టీనేజి ప్రెగ్నెన్సీ వలన కలిగే ఆరోగ్య సమస్యలు గురించి అవగాహన కల్పించాలి
  • జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తిరుపతి జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా ప్రత్యెక శ్రద్ద చూపాలని , టీనేజి ప్రెగ్నెన్సీ వలన కలిగే ఆరోగ్య సమస్యలు గురించి అవగాహన కల్పించాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ మాతా శిశు మరణాలపై జిల్లా వైద్యా శాఖాధికారి డా. బాలకృష్ణ నాయక్, కమీటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మాతా శిశు మరణాల పట్ల వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఏ తల్లి కూడా జన్మనిస్తూ మరణించకూడదని తెలిపారు. బాల్య వివాహాల వలన టీనేజి ప్రెగ్నెన్సీ సమయంలో కలిగే ఆరోగ్య సమస్యలు గురించి ఆశ వర్కర్లు ఏ.ఎన్.ఎం.లు మహిళా పోలీసులు, శిశు సంక్షేమ శాఖా సిబ్బంది అవగాహన కల్పించాలి అని అన్నారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి పోహకారం లోపం లేకుండా చూడాలని, ఆశ వర్క్లు, ఏఎన్ఎంలు, వైద్య అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికిప్పుడు వారు ఆరోగ్య స్థితిగతులను పరిశీలిస్తూ ప్రసూతి సమయం లో జాగ్రత్తలు తెలుసుకోవాలని తెలిపారు. ప్రతి హై రిస్క్ కేసులు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి సాదారణ ప్రసవాలు జరిగేలా చూడాలని వైద్యాదికారులను సూచించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో సాదారణ ప్రసవాల శాతం పెంచాలని అవసరం అయితే తప్ప సిజేరియన్ ఆపరేషన్ లు చేయరాదన్నారు. హై రిస్కు కేసులు వచ్చినప్పుడు వైద్య సిబ్బంది అందుబాటు లో ఉండి వైద్య౦ అందేలా చూడాలన్నారు. జిల్లాలో మాతా శిశు మరణాలు పై ఏమైనా తప్పిదాలు ఉన్నట్లు తెలిసిన వారిపై శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డి.ఐ.ఓ డా. శాంత కుమారి, మెటర్నిటీ హాస్పిటల్ సూపర్న్డెంట్ డా. పార్థ సారథి, డి సి హెచ్ ఎస్ డా. ఆనంద మూర్తి, డా. ప్రసన్న ఠాకూర్, డా. విజయ భాస్కర్, ఆశ వర్కర్లు, ఎ ఎన్ ఎం లు, తదితరులు  పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News