Monday, March 30, 2026

మహిళా దినోత్సవ సందర్భంగా… చీరలు, నగదు, సహాయం, అందజేసిన మహమ్మద్ షాబుద్దీన్ ఖాన్

  • రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మహమ్మద్ షాబుద్దీన్ ఖాన్ ఆధ్వర్యంలో
  • పెద్దపులి నాగారం గ్రామంలో పారిశుద్ధ కార్మికుల సేవలను గుర్తించి చీరలు,నగదు, శాలువాలతో సన్మానం చేసిన షాబుద్దీన్ ఖాన్

నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామపంచాయతీ ఆఫీస్ లో బిఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా నాయకులు మహ్మద్ షాబుద్దీన్ ఖాన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు.. చీరలు, నగదు, శాలువాలతో సన్మానం చేయడం జరిగింది. రంగారెడ్డిజిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మహమ్మద్. షాబుద్దీన్ ఖాన్ మాట్లాడుతూ… పెద్దపులి నాగారం గ్రామంలో పారిశుద్ధ కార్మికుల సేవలను చూసి ప్రతి ఒక్కరు స్పందించవలసిన అవసరం ఉంది అని తెలియజేశారు. నూతన సంవత్సరం మొదలుకొని. డిసెంబర్ నెల వరకు ఎలాంటి పండుగలు వచ్చినా పారిశుద్ధ్య కార్మికులు ముందుండి గ్రామంలో ఉన్న చెత్తాచెదారాన్ని దూరం చేస్తున్న అటువంటి కార్మికులను గుర్తించవలసిందిగా కోరారు. మహిళా దినోత్సవ సందర్భంగా… షాబుద్దీన్ ఖాన్ మాట్లాడుతూ… మహిళలు కుటుంబాల్లోనే కాదు, సమాజ నిర్మాణంలోనూ కీలకమైన శక్తి. “స్త్రీ లేకుండా సృష్టి లేదు”. మహిళల హక్కులు, సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, భవిష్యత్తు దిశగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించే రోజు నేడు.ఈ దినోత్సవానికి మూలాలు 1900వ దశకంలోనే కనిపిస్తాయి. 1908లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 15,000 మంది మహిళలు తమకు సమాన వేతనం, పనిఒడిగే గంటల తగ్గింపు, ఓటు హక్కు కోసం పోరాడారు. 1910లో కోపెన్‌హేగెన్‌లో జరిగిన సోషలిస్ట్ ఇంటర్నేషనల్ సమావేశంలో మహిళా దినోత్సవాన్ని ప్రతిపాదించగా, 1911లో మొదటిసారి జర్మనీ, ఆస్ట్రియా, డెన్మార్క్, స్విట్జర్లాండ్‌లలో దీనిని జరిపారు. 1975లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా మహిళా దినోత్సవాన్ని గుర్తించింది. “స్త్రీ లేకుండా సృష్టి లేదు…” ఈ మాట కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, అది సమాజ అస్తిత్వానికి అక్షరసత్యం. పురాణకాలం నుంచి ఇప్పటి వరకు స్త్రీ శక్తి తన విలక్షణతను నిరూపించుకుంటూ దేశ నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు సామాజిక బంధనాలు, కట్టుబాట్లతో సమానత్వం కోసం పోరాడిన మహిళలు, ఇప్పుడు దేశాన్ని ఏలే స్థాయికి ఎదిగారు.
మహిళల ప్రగతికి నిదర్శనాలు రాజకీయ రంగంలో శక్తివంతమైన మహిళలు నాడు జాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు వంటి వీర మహిళలు స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించగా, నేడు మహిళలు ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఇందిరా గాంధీ (భారత తొలి మహిళా ప్రధాని), ద్రౌపది ముర్ము (భారత తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతి), మమతా బెనర్జీ, జయలలిత, మయావతి లాంటి నేతలు పాలనలో నిపుణతను చాటారు. వ్యాపార & పారిశ్రామిక రంగంలో మహిళా మేటి నేతలు ఒకప్పుడు వ్యాపార రంగం పురుషుల ఆధిక్యంతో నడిచేది. కానీ ఇప్పుడు కిరణ్ మజుందార్ షా (బయాకన్ ), ఫాల్గునీ నాయర్ (నైకా ), ఇందిరా నూయి (పెప్సీక మాజీ సీఈఓ ), ఎస్. సౌమిత్రి (స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మాజీ చైర్‌పర్సన్) లాంటి మహిళలు ప్రపంచ వ్యాపార రంగంలో తమ సత్తా చాటారు. అంతరిక్ష & విజ్ఞాన శాస్త్రంలో మహిళల ఆధిపత్యం భారతీయ మహిళలు నేడు రాకెట్ సైన్స్ కూడా శాసిస్తున్నారు. కల్పన చావ్లా, సునీతా విలియమ్స్ అంతరిక్షంలో భారతీయ మహిళల ప్రతిభను ప్రదర్శించగా, ఐటియు కరిధాల్, నందిని హరిణథ్ లాంటి శాస్త్రవేత్తలు ఐఎస్ఆర్ఓ విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రక్షణ రంగంలో మహిళల సంచలనాలు
నేడు భారత సేనల్లో మహిళలు కమాండింగ్ అధికారులుగా పని చేస్తున్నారు. అభిలాషా బార్‌డ్వాజ్, అవని చతుర్వేది, భవానీ దేవి లాంటి మహిళలు వైమానిక, సైనిక, క్రీడా రంగాల్లో భారత గౌరవాన్ని పెంచారు. క్రీడా ప్రపంచంలో భారత మహిళల ప్రభావం భారత మహిళలు పుట్‌బాల్, క్రికెట్, బాక్సింగ్, బ్యాడ్మింటన్ లాంటి క్రీడల్లో జాతీయ గర్వంగా నిలుస్తున్నారు. పి.వి.సింధు, కోమ్, మిథాలీ రాజ్, సానియా మీర్జా, హర్మన్‌ప్రీత్ కౌర్ లాంటి క్రీడాకారిణులు అంతర్జాతీయ వేదికలపై భారత మేటి ప్రతిభను చాటుతున్నారు. భవిష్యత్తు లక్ష్యం – పూర్తి లింగ సమానత్వం మహిళలు ఎన్నో రంగాల్లో తమ సత్తా చాటుతున్నా, ఇంకా సమాజంలో లింగ వివక్ష, చట్టపరమైన అవరోధాలు, కుటుంబ ఒత్తిళ్లు వంటి సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే మహిళల అభివృద్ధికి మరింత దోహదపడాలి. విద్య, ఆర్థిక స్వావలంబన, లింగ సమానత్వ విధానాలు మరింత బలపడాలి. నేడు మహిళలు అన్ని రంగాల్లో దేశాన్ని ఏలే స్థాయికి ఎదిగారు. కానీ ఇది ప్రారంభం మాత్రమే! “స్త్రీల అభివృద్ధి అంటే దేశ అభివృద్ధి” అనే అర్ధంతో మహిళా శక్తికి మరింత ఆదరణనివ్వాలి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా “ఒక్క రోజు కాదు, ప్రతి రోజూ మహిళా శక్తిని గౌరవించాలి!”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News