Monday, March 23, 2026

మహిళల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు

  • జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. హరీష్ రాజ్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- మహిళల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా, హరీష్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రాన్ని సందర్శించి వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ, మహిళల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆరోగ్య మహిళా కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న మహిళలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, ఆరోగ్యం కొరకు పాటించవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని, వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News