Monday, March 23, 2026

దివ్యాంగులకు ప్రతినెల నాలుగవ శనివారం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు): దివ్యాంగులకు ప్రతినెల నాల్గవ శనివారం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా వెల్లడించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి తో కలసి దివ్యాంగులు, వయో వృద్ధుల నుండి వినతులు స్వీకరించి సంభందిత అధికారులకు మానవతా దృక్పథంతో త్వరిత గతిన పరిష్కరించాలని ఆదేశించారు. శనివారం ప్రజావాణి లో దివ్యాంగులు, వయోవృద్ధుల నుండి వినతులు స్వీకరించిన (13) దరకాస్తుల్లో. డిఎస్సిడిఓ కు సంబందించి 7, జిల్లా సంక్షేమ శాఖ 5, జిల్లా పరిషత్తు కు సంబంధించిన 01 ఉన్నాయి. ఈ గ్రీవెన్స్ లో డిఆర్డీఓ కౌసల్యాదేవి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, దివ్యాంగులు, వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News