Tuesday, March 17, 2026

ఈనెల 5వ తేదీన అసెంబ్లీ స్పెషల్ సెషన్

  • అసెంబ్లీ స్పెషల్ సెషన్ తో పాటు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం
  • ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం బహుజన జాగృతి సమితి (బీజేస్ ) వ్యవస్థాపక అధ్యక్షులు గోషికే యోహన్

మెదక్ జిల్లా, కొల్చారం, నేటి సాక్షి ( భూమయ్య):- 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయం గర్వించదగ్గ విషయం అందుకు బహుజనుల జాగృతి సమితి తరపున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీసీ కులా గణన ద్వారా చిట్ట చివరన ఉన్న బీసీ కూడా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగ సంక్షేమ ఫలాలు అందుతాయి, అలాగే రాజకీయంగా ఉద్యోగ పరంగా వారికి లబ్ధి చేకూర్తుంది మరియు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఎస్సిలో ఉన్నటువంటి 59 కులాలకు వారి శ్రమ దగ్గ ప్రతిఫలం అదుతుందని అందుకు పోరాటం చేసిన ఎమ్మార్పీఎస్ అమరవీరుల త్యాగానికి ప్రతిరూపం ఎస్సీ రిజర్వేషన్ జరగడం అందుకు పోరాట బాటలు వేసిన మందకృష్ణ మాదిగ గారికి రాష్ట్ర మంత్రివర్యులు మంత్రి దామోదర రాజనర్సింహ గారికి మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నర్సింహులు గారికి జాతీ రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లు మల్లారెడ్డి, సంగాయిపేట గ్రామ శాఖ అధ్యక్షులు సంగన్న గారి ఆగం గౌడ్, మాజీ సర్పంచ్ బద్య నాయక్, బహుజన నాయకులు నాయకులు జయరాజ్, నవీన్, జై సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News