నేటి సాక్షి, వీణవంక : వీణవంక మండలం చల్లూరు లోని ఇసుక స్టాక్ యార్డ్, రీచ్ పాయింట్ వద్ద ప్రత్యేక బృందం శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేపట్టింది. రెవిన్యూ, మైన్స్, పోలీస్, రవాణా శాఖ అధికారుల బృందం ఇసుక స్టాక్ యార్డులోని నిల్వలను పరిశీలించింది. రాయల్టీ ఇన్ స్పెక్టర్ నమోదు చేసిన ఇసుక రవాణా వివరాల రిజిస్టర్లు తనిఖీ చేసింది. ఈ సందర్భంగా మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాఘవరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. చల్లూరు రోడ్డులో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామని, పోలీస్, రెవెన్యూ, మైన్స్, రవాణా ఉద్యోగులతో ఏర్పాటు చేసిన బృందం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ జియాలజిస్ట్ వెంకటేశ్వరరావు, వీణవంక పోలీస్ ఇన్స్పెక్టర్, తహసిల్దార్, రెవిన్యూ, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.





