- తిరుపతి కమిషనర్ ఎన్. మౌర్య
నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : టి.డి.ఆర్. బాండ్ల ధ్రువీకరణ పనులు వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. టి.డి.ఆర్. బాండ్ల ధ్రువీకరణ, స్థల యాజమానుల గుర్తింపు, ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్, ఫైళ్ల పరిష్కారం తదితర అంశాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు, కార్యదర్శులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ టి.డి.ఆర్. బాండ్లు అందేలా వారి యొక్క ధ్రువపత్రాలు పరిశీలన చేయాలని అన్నారు. మీరు స్వయంగా వెళ్లి స్థల యజమానిని గుర్తించి పరిశీలన చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేక లాగిన్ చేయించి, రిజిస్టర్ చేయించాలని అన్నారు. టి.డి.ఆర్. బాండ్లు దృవీకరణలో పారదర్శకంగా వ్యవహరించాలని, ఏదైనా పొరపాట్లకు తావిస్తే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయకుండా చూడాలని అన్నారు. నగరంలో అనధికార భవన నిర్మాణాలు జరకుండా పర్యవేక్షణ చేయాలని అన్నారు. ప్రభుత్వ భూముల పర్యవేక్షణ మనందరి బాధ్యతగా పని చేయాలని అన్నారు. ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్. ఫైళ్లు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో డి.సి.పి. మాహాపాత్ర, ఏ.సి.పి.లు బాలాజి, మూర్తి, టి.పి.బి.ఓ. లు మధు, వంశీ, ప్లానింగ్ కార్యదర్శులు, రోడ్డు ఇన్చార్జి లు తదితరులు ఉన్నారు.





