నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి): కోరుట్ల శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాలలో ఆదివారం ఆత్మీయ కలయిక కార్యక్రమం జరిగింది. సరస్వతి విద్యాపీఠం జిల్లా అధ్యక్షులు , ప్రముఖ వైద్యులు డాక్టర్ వేముల ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ కలయిక – 2025 లో పూర్వ విద్యార్థినీ విద్యార్థులు, పూర్వ ఆచార్యులు, పాఠశాల శ్రేయోభిలాషులు మరియు పుర ప్రముఖులు సుమారుగా 100 మంది పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన RSS జిల్లా కార్యవాహ, ప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీ గోల్కొండ నాగరాజు మాట్లాడుతూ శిశు మందిరం పాఠశాలలు సంస్కృతి, సంప్రదాయాలకు నెలవని, వీటిలో చదివిన పిల్లలను నిఖార్సైన దేశ భక్తులుగా తయారు చేస్తూ, జాతికి ఉత్తమ పౌరులను అందిస్తుందని , ఇలాంటి శిశు మందిరం పాఠశాలల అవసరం నేటి సమాజంలో ఎంతో ఉందని, అందరం కలిసి పాఠశాలను మరింత అభివృద్ధి పథంలో నడపడానికి తమ వంతుగా కృషి చేయాలని చెప్పడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో పూర్వ ప్రధానాచార్యులు శ్రీ బండారు కమలాకర్ మరియు ప్రస్తుత ప్రబంధకారిణి అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ వేముల రవికిరణ్,వనపర్తి చంద్ర మోహన్ మరియు సహ కార్యదర్శి ఎలిమిల్ల మనోజ్ కుమార్,కోశాధికారి మరియు కరస్పాండెంట్ నీలి శ్రీనివాస్,సభ్యులు అందె శివ ప్రసాద్, కొండ బత్తిని అమర్ నాధ్, శ్రీమతి పాలెపు సాయి దివ్య,మరియు సమితి కార్యదర్శి శ్రీ చెట్ పల్లి శంకర్, సమితి సభ్యులు మంచాల జగన్, ముదిగొండ రాజేశం, పిస్క రమేష్ మరియు ప్రస్తుత ప్రధానాచార్యులు గోపు వెంకటేష్ మరియు ఆచార్య బృందం పాల్గొన్నారు.





