- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్


నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ) : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనీ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు..శనివారం వేములవాడ పట్టణ పరిధిలోని నాంపల్లిలోని నిర్మలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో నిర్వహించిన స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ లో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై స్పోర్ట్స్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు..ఈ సందర్భంగా ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు..వారు మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే జీవితంలో ఎంత పెద్ద ఇబ్బందులు ఎదురైన దృఢంగా ఉంటారని పేర్కొన్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాశం శరీరక దృఢత్వం లభిస్తుందన్నారు. ఆనాడు చదువుకుందాం అంటే సౌకర్యాలు లేని సందర్భంలో ఇప్పుడు సకల సౌకర్యాలు ఉన్నాయని చక్కగా చదువు లో రాణించి తల్లిదండ్రులు మీ పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని అన్నారు. విద్యావలన జీవితంలో మంచిని స్వీకరించి, చెడును వదిలేయన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులలోని సృజనాత్మను వెలికి తీసి వారిని ఆయా రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. పాఠశాలలో పేద విద్యార్థులకు ప్రాధన్యత ఇవ్వలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో విద్యావ్యవస్థల పెను మార్పులు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారని రానున్న ఒలంపిక్ పోటీల్లో పాల్గొనడానికి రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు రాణించాలని పిలుపునిచ్చారు.





