నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి, ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో స్నేహమిత్ర యూత్ వ్యవస్థాపకులు న్యాయవాది జాజాల రమేష్ అధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను విశ్రాంత ఎస్పీ మదాసు రమేష్ బాబు ప్రారంభించారు ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శరీర దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు, చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని, క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ గెలుపు ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలని. క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధననే ముఖ్యంని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజి ఎంపీటీసీ సభ్యులు రెడ్డవేణి సత్యం, నేరెళ్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కసరాపు బలగౌడ్, గోవిందుపల్లే అధ్యక్షులు పురంశేట్టి మల్లేశం మాజీ ఎంపీటీసీ సభ్యులు కాశెట్టి మల్లేశం సామజిక సేవకులు బైరి గణేష్, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మెన్ జంగిలి తిరుపతి, అరబిందో అధినేత జాజాల రవీందర్, హెల్పింగ్ హాండ్స్ అధినేత పాదం గంగారెడ్డి, గోవిందుపల్లే మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు పురంశెట్టి సుధాకర్, నాయకులు పోతరాజు లింగారెడ్డి, కోల రాయమల్లు వేముల రమేష్, మడిశెట్టి లక్ష్మణ్, చాకినం వెంకటేశం క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ సామల ప్రశాంత్ జంజూరు నవీన్ దాస గణేష్ తీగల నవీన్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.





