నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు): స్ప్రింగ్ స్ప్రీ 2025 – ఎన్ ఐ టి వరంగల్ లో గ్రాండ్ కల్చరల్ ఉత్సవం ఫిబ్రవరి 28, 2025 నుండి మార్చి 2, 2025 వరకు ఘనంగా నిర్వహించబోతున్నారు. పద్మ శ్రీ డా.. బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఎన్ ఐ టి వరంగల్ ప్రతిష్టాత్మక వార్షిక సాంస్కృతిక మహోత్సవమైన స్ప్రింగ్ స్ప్రీ 2025-కు ముస్తాబవుతోంది. సంగీతం, నృత్యం, కళలు, వినోదం వంటి రంగాల్లో ప్రతిభ ను వెలికి తీయడానికి వేదికగా స్ప్రింగ్ స్ప్రీ దక్షిణ భారతదేశం లోని ప్రముఖ కళాశాలల వార్షి కోత్సవాల్లో ఒకటిగా పేరు గాంచింది. దేశ వ్యాప్తంగా విద్యార్థులు, కళాకారులు, ప్రదర్శకులు పెద్ద ఎత్తున ఈ మహోత్సవానికి హాజరవుతారు. పోటీలు, వర్క్ షాపులు, ప్రో-షోలు లాంటి విభిన్న కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేయనున్నాయి. సాంస్కృతిక ప్రదర్శనలు, సాహిత్య కార్య క్రమాలు, సాహస క్రీడలు, సంగీత విభావరి వంటి అనేక కార్యక్రమాల తో స్ప్రింగ్ స్ప్రీ 2025 యువత లోని ప్రతిభ ను, సృజనాత్మకతను ప్రోత్సహించనుంది. ఈ వేడుకలకు మరింత ఉత్సాహాన్ని కలిపేందుకు పద్మ శ్రీ డా. బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తన అమోఘమైన హాస్యం తో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న బ్రహ్మానందం స్ప్రింగ్ స్ప్రీ 2025 వేదికపై సందడి చేయనున్నారు.





