Saturday, March 14, 2026

క్యాట్ లెవెల్ 2 ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

నేటి సాక్షి-కరీంనగర్: శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు క్యాట్ లెవెల్ 2 ఫలితాలలో ప్రభంజనం సృష్టించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని చింతకుంట శ్రీ చైతన్య సీబీఎస్ఈ, సీఓ-ఐపీఎల్ బ్రాంచ్ లో విద్యార్థిని, విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన కరీంనగర్ జోన్ ఏజీఎం ఎం. రాజు మాట్లాడుతూ… శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులు క్యాట్ లెవెల్ 2 ఫలితాలలో విజయదుంబిని మోగించారని తెలిపారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ ఆచార్య మాట్లాడుతూ… ఇటీవల జరిగిన క్యాట్ లెవెల్ 2 పరీక్షలలో చింతకుంట బ్రాంచ్ విద్యార్థులు ఉన్నతమైన ప్రతిభ కనబరిచారన్నారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, విభాగాల నుండి 70 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్, క్యాష్ ప్రైస్ గెల్చుకున్నారన్నారు. మరో 80 మంది విద్యార్థులు మెడల్, మెరిట్ సర్టిఫికెట్ ను గెలుచుకున్నారన్నారు. అందులో రూ.5 వేల క్యాష్ ప్రైస్ 21మంది, రూ.3 వేల క్యాష్ ప్రైస్ 37 మంది, రూ.2 వేల క్యాష్ ప్రైస్ ఆరుగురు, రూ. వెయ్యి క్యాష్ ప్రైస్ ఆరుగురు గెలుచుకున్నారన్నారు. ఇలాంటి ఒలంపియాడ్ పరీక్షలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సందర్భంలో ఏటేటా విద్యార్థుల ప్రతిభను కనబరుస్తున్నారన్నారు. రాబోయే కాలంలో ప్రముఖ పోటీ పరీక్షలలో విద్యార్థులు సత్తా చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ శ్రీధర్, శ్రీ చైతన్య విద్యా సంస్థ డైరెక్టర్ శ్రీవిద్య, ఆల్ ఇండియా అకాడమీ కోఆర్డినేటర్ సతీష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ జయరాజు, ఏజిఎం ఏం రాజు, జోనల్ అకాడమిక్ కోఆర్డినేటర్ ప్రవీణ్, ఐపీఎల్ ఇంచార్జ్ శ్రీకాంత్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News