Saturday, March 14, 2026

శ్రీ దుబ్బరాజేశ్వరస్వామి జాతర

  • శ్రీ దుబ్బరాజేశ్వరస్వామి జాతర పోస్టర్ ను ఆవిష్కరించిన ఏఎస్పి శేషాద్రిని రెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : వేములవాడ రూరల్ మండలంలోని నాగయ్యపల్లిలో ఈనెల 28 నుండి జరిగే శ్రీ దుబ్బరాజేశ్వరస్వామి వారి జాతర వాల్ పోస్టర్ ను శనివారం వేములవాడ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ముందుగా ఏఎస్పి శేషాద్రిని రెడ్డి కి రాజన్న కండువా కప్పి ఘనంగా సన్మానించారు. రెండు రోజులపాటు జరిగే శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి జాతరకు రావలసిందిగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాగయ్యపల్లి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రొండి లక్ష్మణ్, బండి కొండయ్య, గుంటి కొమురయ్య, శెట్టి పెళ్లి శ్రీకాంత్, బండి రజనీకాంత్, దయ్యాల అంజయ్య, వేముల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News